గుంటూరు జిల్లాలో మిర్చి అధికంగా పండిస్తారు. పంట కోశాక కల్లాలకు తరలించి ఎండబెడతారు. ఇళ్లలో తగినంత స్థలం ఉండకపోవడంతో పొలాల్లోనే ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ ఏడాది తామర పురుగు చీడతో జిల్లాలో మిర్చి పంట చాలా చోట్ల బాగా దెబ్బతింది. దీనివల్ల దిగుబడి తగ్గి.. పంటకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కల్లాల్లో ఆరబోసిన మిర్చిని రాత్రికిరాత్రే దొంగలు ఎత్తుకెళుతున్నారు. నుదురుపాడు, తిమ్మాపురం, నాదెండ్ల మండలాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు.. యడ్లపాడుకు చెందిన రైతులు కొందరు వినూత్నంగా ఆలోచించారు. మిర్చి ఆరబోసిన కల్లాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పొలంలో కర్రలు పాతి.. వాటి సాయంతో లైట్లు, సీసీటీవీ కెమెరాలు అమర్చారు.
కల్లాల్లో డేగ కన్ను..