ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CC Cameras: నిఘా నేత్రాలు..అలంకార ప్రాయం !

నేరాల అదుపు, నిందితుల వేటలో నిఘా నేత్రాలది (CC Cameras) కీలక పాత్ర. అలాంటి సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారుతున్నాయి. కేసుల చేధనలో పోలీసులకు ఉపయుక్తమైన నిఘా నేత్రాలు నిర్వహణ లోపం వల్ల నిద్రావస్థలోకి వెళ్తున్నాయి. ఫలితంగా నేరాలు జరిగి రోజులు గడుస్తున్నా..పోలీసులు నిందితులను పట్టుకోలేకపోతున్నారు.

నిఘా నేత్రాలు
నిఘా నేత్రాలు

By

Published : Sep 10, 2021, 5:22 PM IST

నేరాల అదుపు, నిందితుల వేటలో నిఘా నేత్రాలది (CC Cameras) కీలక పాత్ర. అందుకు అనుగుణంగా గుంటూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం వల్ల అవి అలంకార ప్రాయంగా మారుతున్నాయి. తాజాగా..గుంటూరు జిల్లా పాలడుగు అడ్డరోడ్డులో దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా..గుర్తు తెలియని నలుగురు దుండగులు కొడవళ్లతో బెదిరించి మహిళపై అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. దుండగులను గుర్తించేందుకు ఆనవాళ్లు లేకపోవటంతో ఈ కేసు పోలీసులకు (Police) సవాల్​గా మారింది.

నిఘా వైఫల్యంతో అనేక ఘటనలు

నిఘా వైఫల్యం కారణంగా జిల్లాలోని మేడికొండూరు మండల పరిధిలో ఈ మధ్య కాలంలో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం పాలడుగు అడ్డరోడ్డులో దంపతుల ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా..గుర్తు తెలియని దుండగులు వారిని చితకబాది బంగారు, నగదుతో ఉడాయించారు. ఇదే ప్రాంతంలో ఓ మహిళ పొలం పనుల్లో ఉండగా..మంచినీళ్ల కోసం వచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు లాక్కొని పారిపోయారు. రాజపాలేనికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి రాత్రి సమయంలో అడ్డరోడ్డులో కారు ఆపి భోజనం చేస్తుండగా ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో బెదిరించి రూ. 15 వేలు అపహరించుకెళ్లారు. ఇలా వరుస దొంగతనాలు, దారుణాలు జరుగుతున్నా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు.

అలంకార ప్రాయంగా నిఘా నేత్రాలు..

మేడి కొండూరు పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు అలంకార ప్రాయంగా మారాయి. నిర్వహణ లోపం వల్ల అవి పనిచేయకుండా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని దుండగులు యథేచ్ఛగా దోపీలకు పాల్పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని సీసీ కెమెరాలను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

GANG RAPE: భర్తనుకొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం !

gang rape case: పాత నేరస్థులను విచారిస్తున్న పోలీసులు ...

ABOUT THE AUTHOR

...view details