గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన వృద్ధుడు చేరెడ్డి జనార్దన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ఇతరులకు షేర్ చేస్తున్నారనే అభియోగంపై చేరెడ్డి జనార్దన్‌ను ఇటీవల సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి నోటీసులు అందజేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు జనార్దన్‌ను కలిసి పరామర్శించారు.
అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: చంద్రబాబు - chandrababu fire on cid
ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను ఇతరులకు షేర్ చేస్తున్నారనే అభియోగంపై గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన వృద్ధుడు చేరెడ్డి జనార్దన్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోని నోటీసులు ఇవ్వడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరెడ్డి జనార్దన్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
చేరెడ్డి జనార్దన్‌కు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబును కలిసిన జనార్దన్ అధినేతకు జరిగిన పరిణామాలు వివరించారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని జనార్దన్‌కు ధైర్యం చెప్పిన చంద్రబాబు, అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ధైర్యంగా ఎండగట్టాలని సూచించారు.
ఇదీ చదవండి: