ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాథమిక హక్కులు హరించేలా పోలీసుల తీరు: డీజీపీకి లేఖలో చంద్రబాబు

ప్రభుత్వ విధానాలపై అసమ్మతి గళం వినిపించే వారిని పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు.. డీజీపీ గౌతం సవాంగ్​కు లేఖ రాశారు. గుంటూరు అరండల్ పేట పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

cbn letter to dgp
అక్రమ అరెస్టులపై డీజీపీకి చంద్రబాబు లేఖ

By

Published : May 19, 2021, 2:15 PM IST

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించి, అసమ్మతి గళం వినిపించే వారిని పోలీసులు లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో సామాజిక మాధ్యమ కార్యకర్తలు మహేశ్, కల్యాణ్ ను పోలీసులు అరెస్టు చేశారని డీజీపీ గౌతం సవాంగ్​కు రాసిన లేఖలో ఆగ్రహించారు.

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించేలా.. అసమ్మతి స్వరాలపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించటం తగదని హితవు పలికారు. ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించిన పోలీసులు బేషరతుగా బాధితులను విడుదల చేసి, అక్రమ నిర్బంధాలు, అరెస్టులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వారిని అరెస్టు చేసిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీపై తమ అసమ్మతి గొంతు వినిపించిన వారిని ఉద్దేశించే పోలీసులు మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారని లేఖలో విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details