గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో.. ఏసీ, ఫ్రిజ్ అందుబాటులోకి వచ్చాయి. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యే ముస్తఫా వీటిని ప్రారంభించారు. కొద్ది రోజులుగా రక్తనిధి కేంద్రంలోని ఏసీ, ఫ్రిజ్ పనిచేయని కారణంగా.. బ్లడ్ సాంపిల్స్ నిలువ చేయడానికి సమస్యగా మారింది. సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన డాక్టర్. బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఆళ్ల రామారావు.. దాతల ఆర్ధిక సహాయంతో కలిపి దాదాపు రూ.2.8 లక్షలు సమకూర్చారు. వీటితో.. ఏసీ, ఫ్రిజ్‌లను బ్లడ్ సెంటర్‌కు అందజేశారు.
ప్రభుత్వాసుపత్రి రక్తనిధికి నూతన ఫ్రిజ్, ఏసీ - Blood Donation Center open in ggh
గుంటూరు ప్రభుత్వాసుపత్రి రక్తనిధి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ, ఫ్రిజ్‌లను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. డాక్టర్. బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఆళ్ల రామారావు ఆర్ధిక సహాయంతో వీటిని ఏర్పాటు చేశారు.
![ప్రభుత్వాసుపత్రి రక్తనిధికి నూతన ఫ్రిజ్, ఏసీ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రెండు ఏసీ ఫ్రిజ్‌లు అందజేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6486414-1096-6486414-1584742393278.jpg)
గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రెండు ఏసీ ఫ్రిజ్‌లు అందజేత
Last Updated : Mar 21, 2020, 2:53 PM IST