ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరులో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ స్పష్టం చేశారు. నగరంలోని తన కార్యాలయంలో రక్తదాన శిబిరానికి సబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కరోనా కారణంగా రక్త నిల్వలు బాగా తగ్గిపోయాయని..,ఆపదలో ఉన్నవారు అనేక ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారిని ఆదుకోవడానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
గుంటూరులోని మాజేటి గురవయ్య పాఠశాలలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరవుతారని వెల్లడించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరారు.