రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో ప్రధాని మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్బర భారత్ అభియాన్' పథకం.. దేశచరిత్రలోనే ఒక గొప్ప మేలిమలుపు అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం దిశగా ఇది గొప్ప నిర్ణయమన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పూర్తి భరోసా కల్పించారని చెప్పారు.