BJP public rally vehicle: గుంటూరు జిల్లాలో భాజపా ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. భాజపా ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్‌లోని రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి ఉంచారు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రచార రథానికి కొందరు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
ఒక్కసారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అర్పివేశారు. నలుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రజా పోరు ద్వారా ప్రజలకు వివరిస్తున్నందునే అధికార పార్టీకి చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భాజాపా నేతలు ఆరోపిస్తున్నారు.