దేవాదాయశాఖ నిధులను ప్రభుత్వం.. అమ్మఒడి పథకానికి మళ్లించిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. జీవో నంబరు 18 ద్వారా రూ.25 కోట్లు నిధులు అమ్మఒడికి మళ్లించారని ఆక్షేపించారు. నిధుల మళ్లింపు భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబరు 18ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల విషయంలో వైకాపా సర్కారు రోజూ ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటోందని విమర్శించారు.
దేవాదాయశాఖ నిధులు అమ్మఒడి పథకానికి ఎలా మళ్లిస్తారు? : విష్ణువర్ధన్ రెడ్డి - దేవాదాయశాఖ నిధులు అమ్మఒడికి మళ్లింపు వార్తలు
అమ్మఒడి పథకానికి దేవాదాయశాఖ నిధులు రూ. 25 కోట్లు మళ్లించారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. నిధుల మళ్లింపునకు జీవో నంబరు 18ని తెచ్చారన్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయాల అభివృద్ధికి భక్తుల ఇచ్చిన సొమ్మును ప్రభుత్వం ఎలా మళ్లిస్తుందని ప్రశ్నించారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న అర్చకులను ఆదుకోవాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇతర మతాల వారి విషయంలో ఇలాంటి చర్యలు తీసుకోగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి దేవాదాయ శాఖకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం... ఆలయాల అభివృద్ధికి భక్తులు ఇచ్చిన సొమ్ము తీసుకునే హక్కు లేదన్నారు. కరోనా కారణంగా ఆలయాలలో పనిచేసే అనేక మంది అర్చకులు గత ఐదు నెలలుగా పూట గడవక ఇబ్బంది పడుతున్నారన్నారు. అర్చకుల సంక్షేమ నిధుల వినియోగించి వారిని ఆదుకోవాలని దేవాదాయశాఖను విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఈ విషయంపై తక్షణమే స్పందించాలన్నారు.
ఇదీ చదవండి :కరోనా ఎఫెక్ట్ : కొనుగోళ్లు లేక తాటిబెల్లం గీత కార్మికులు అవస్థలు