ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తుంది' - పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తుంది

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

Vishnu Vardhan Reddy on panchayat elections
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తుంది

By

Published : Jan 25, 2021, 4:49 PM IST

సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును ఎవరైనా పాటించాల్సిందేనని అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే పాలకవర్గాలు ఏర్పడి కేంద్రం నిధులు అందుతాయని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. రాజ్యాంగ సంస్థలను అందరూ గౌరవించాలని.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిరంతర ప్రక్రియ అని విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details