ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మేము అధికారంలోకి వస్తే.. యూ1 జోన్ రద్దు దస్త్రంపైనే తొలి సంతకం' - గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Somu Veerraju: తాడేపల్లిలో యూ1 జోన్ రైతుల నిరాహారదీక్షకు భాజపా నేత సోము వీర్రాజు మద్దతు తెలిపారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్న సోము వీర్రాజు... ప్రభుత్వం యూ1 జోన్ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

BJP leader Somu Veerraju supports U1 zone farmers
యూ1 జోన్ రైతుల నిరాహారదీక్షకు భాజపా నేత సోము వీర్రాజు మద్దతు

By

Published : Apr 19, 2022, 1:12 PM IST

యూ1 జోన్ రైతుల నిరాహారదీక్షకు భాజపా నేత సోము వీర్రాజు మద్దతు

Somu Veerraju: వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే యూ1 జోన్ రద్దు దస్త్రం పైనే తొలి సంతకం చేస్తామని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో యూ1 జోన్ ఎత్తివేయాలంటూ 15 రోజులుగా.. రైతులు చేస్తున్న నిరాహార దీక్షకు సోము వీర్రాజు మద్దతు పలికారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్న ఆయన... వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details