ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలు: సోమువీర్రాజు - somu veeraju fire on ycp govt

పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గుంటూరు జిల్లా రెంటచింతల, దాచేపల్లిలో పర్యటించిన ఆయన... అధికారుల తీరుపై మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

somu veeraju
సోమువీర్రాజు

By

Published : Feb 14, 2021, 5:06 PM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నాయని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గుంటూరు జిల్లా రెంటచింతల, దాచేపల్లిలో పర్యటించిన ఆయన... స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి మమకారం లేదని విమర్శించారు. సంక్షేమ పథకాలపై నమ్మకముంటే ఎందుకీ ఏకగ్రీవాలని ప్రశ్నించారు. సరైన పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయం వైకాపాలో కనిపిస్తోందన్నారు.

ఈ ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని సోము ఆరోపించారు. అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెట్టారన్నారు. రక్షణ కోసం పోలీసుల వద్దకు వెళ్తే బెదిరింపులు, కేసులు పెడతారా..? అని నిలదీశారు. ప్రభుత్వం కేవలం ఐదేళ్లే ఉంటుందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని వీర్రాజు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details