నవంబర్లో అమిత్ షా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు జరుగుతాయని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాష్టంలో కొందరు వ్యక్తులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని... దేశంలో ఆర్థిక మాంద్యం ప్రభావం ఏమాత్రం లేదన్నారు.
'తెదేపాతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు' - BJP Leader satya kumar comments on jagan
వచ్చే నెలలో అమిత్ షా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు ఉంటాయని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెదేపాతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్
రాష్టంలో రైతులును అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలు... రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. గత ముఖ్యమంత్రి రుణమాఫీ అని చెప్పి ప్రజలను మోసాగించారని... అదే ఆయన ఓటమికి కారణమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులను మభ్యపెడుతుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 4నెలలు గడిచినా ఇచ్చిన హామీలు ఎక్కడ ఆమలు చేయలేదన్నారు. పెద్దపెద్ద నేతలు భాజపాలో చేరే అవకాశాలున్నాయన్నారు.
ఇదీ చదవండీ... కోడిపందేల కేసు... కోర్టుకు హాజరైన చింతమనేని
TAGGED:
జగన్పై సత్యకుమార్ కామెంట్స్