భాజపాకి అనుబంధంగా పనిచేస్తున్న భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ విభాగాన్ని.. ఆ సంస్థ అఖిల భారత అధ్యక్షుడు అర్నబ్ ఛటర్జీ గుంటూరులోని అరండల్‌పేటలో ప్రారంభించారు. సంఘటిత రంగ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ ఉద్దేశ్యమని.. ఏపీ ఇంఛార్జ్ శివప్రసాద్ తెలిపారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఈ విభాగం సేవలందిస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో జిల్లాల వారీగా కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు.
గుంటూరులో భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ విభాగం - bjmc ap wing inaugaration in guntur
గుంటూరులోని అరండల్‌పేటలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ విభాగం ఏర్పాటైంది. ఆ సంస్థ అఖిల భారత అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ చేతుల మీదుగా.. ఈ కార్యక్రమం జరిగింది. సంఘటిత రంగ కార్మికుల సమస్యలపై తమ గళం వినిపిస్తామని.. రాష్ట్ర ఇంఛార్జ్ శివ ప్రసాద్ తెలిపారు.
భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ విభాగం ప్రారంభం