గుంటూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఐకాస నాయకులు ఆదివారం నిరసన బాట పట్టారు. విజయవాడలో ఆంగ్ల మాధ్యమాన్ని వద్దు అంటూ కొన్ని సంఘాలు చేపట్టిన బహిరంగ సభకు వ్యతిరేకంగా వీరు ఆందోళన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ముందుకొస్తుంటే దానిని అడ్డుకోవడం సరికాదని నాయకుల అన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకోవడం వలన వెనుకబడిన వర్గాల వారు ఇంకా వెనుకబడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేసే జీవోకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.
'ఆంగ్ల మాధ్యమానికి బహుజన జేఏసీ మద్దతు' - bahujan jac supports govt Go
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమానికి బహుజన జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. విజయవాడలో కొందరు నాయకులు ఇంగ్లీషు వద్దు అంటూ చేపట్టిన బహిరంగ సభకు వీరు గుంటూరులో నిరసన చేశారు.

'ఆంగ్ల మాధ్యమానికి జేఏసీ సంపూర్ణ మద్దతు'