Baby at roadside: బిడ్డ ఏడుపు శబ్ధం వింటేనే తల్లి మనసు తల్లడిల్లుతుంది. శిశువు ఆకలి తీరిస్తే తన కడుపు నిండినంత సంతోషపడుతుంది. చిన్నారి కేరింతలు కొడుతుంటే సంబరపడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం వీటన్నింటికి విరుద్ధంగా కన్న బిడ్డను కనికరం లేకుండా రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం వింజనంపాడులో చోటు చేసుకుంది.
Baby at roadside: "నేనేం పాపం చేశానమ్మ... నన్నేందుకు ఇక్కడ వదిలేశారు" - బాపట్ల లేటెస్ట్ అప్డేట్స్
Baby at roadside: నులివెచ్చని అమ్మపొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప.. రోడ్డు పక్కన పడి ఉంది. తల్లిపాల తొలి రుచి చూడాల్సిన ఆ పసికందు ఆకలితో అలమటించింది. కంటిపాపగా కాపాడుకోవాల్సిన ఆ తల్లి.. కనీసం బొడ్డు కూడా ఊడని ఆ బిడ్డను రహదారి పక్కన వదిలేసి వెళ్లింది.
Baby at roadside: బొడ్డు కూడా ఊడని స్థితిలో రోడ్డు పక్కన పసికందును స్థానికులు గుర్తించారు. బొడ్డు కూడా ఊడని స్థితిలో శిశువును చూసి కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పసికందును యద్దనపూడి పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆడపిల్ల అని వదిలేసి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Case on constable: కానిస్టేబుల్‌పై కేసు నమోదు... కారణం అదే..!