ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం - ayyappa swamy padipooja a.agraharam

గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారం పట్నంబజార్​లో అయ్యప్ప స్వామి 14వ పడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ వాసవీ మణికంఠ భక్తమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం
గుంటూరులో వైభవంగా పడిపూజ కార్యక్రమం

By

Published : Dec 15, 2019, 9:17 PM IST

వైభవంగా అయ్యప్ప పడిపూజా కార్యక్రమం

గుంటూరు ఆర్.అగ్రహారం పట్నంబజార్​లో నిర్వహించిన పడి పూజ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. గురు స్వాముల వేద మంత్రోచ్ఛరణల మధ్య గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్పస్వామికి పుష్పాలంకరణ పూజలు నిర్వహించారు. పెద్ద మండపాలు... పుష్పాల అలంకరణ, విద్యుత్ కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి తాళ్లాయపాలెం పీఠాధిపతి శివ స్వామి హాజరయ్యారు. అయ్యప్పస్వామి దీక్ష ఎంతో పవిత్రమైనదని... భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే స్వాములుకు దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుందని శివస్వామి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details