ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ప్రతినిధులు వినూత్న రీతిలో కృషి చేస్తున్నారు. గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ ఉచిత ఉల్లిపాయల కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్లో ఉల్లికి అధిక ధరలు పలుకుతున్న నేపథ్యంలో.. ప్లాస్టిక్ వస్తువులు తీసుకువస్తే వాటికి సమాన బరువుతో ఉల్లిని ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడం సామాజిక బాధ్యతన్న మోహన్ కృష్ణ.. తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ తరహా కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరిస్తామని తెలిపారు.
ప్లాస్టిక్‌తో రండి.. ఉల్లిపాయలతో వెళ్లండి.. - గుంటూరులో ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమం వార్తలు
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని నాట్స్ మాజీ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. గుంటూరులో ప్లాస్టిక్‌ను నిరోధించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు.
గుంటూరులో ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమం