కరోనా నియంత్రణకు ఆటో డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. 'అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ' సంస్థ ఆధ్వర్యంలో.. ఆటో చోదకులకు శానిటైజర్లు, మాస్కులు, ఆటో షీట్లను పంపిణీ చేశారు. గుంటూరు కన్నవారితోటలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆటో డ్రైవర్లకు శానిటైజర్లు, మాస్కులు, షీట్ల పంపిణీ - our youth social community corona awareness program in guntur
గుంటూరు నగరం కన్నవారితోటలో.. 'అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ' నిర్వహించిన కార్యక్రమంలో కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. ప్రజా రవాణాలో ప్రముఖ పాత్ర పోషించే ఆటో డ్రైవర్లు.. శానిటైజర్లు, మాస్కులు వినియోగించాలని సూచించారు. సంస్థ నిర్వాహకులను ప్రశంసించారు.

గంటూరులో అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ సేవలు