ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో తెదేపా అభ్యర్థిపై హత్యాయత్నం కేసు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లాలోని 42వ డివిజన్ తెదేపా అభ్యర్థి బుజ్జిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

MURDER CASE FILE ON TDP LEADERS IN GUNTUR
గుంటూరులో తెదేపా అభ్యర్థిపై హత్యాయత్నం కేసు

By

Published : Mar 12, 2021, 10:50 AM IST

గుంటూరులోని 42 డివిజన్ తెదేపా అభ్యర్థి బుజ్జిపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. 42 డివిజన్‌లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలో పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బుజ్జితో పాటు డివిజన్ తెదేపా అధ్యక్షుడు ఉదయ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావులపై కేసులు నమోదయ్యాయి.

ఈనెల 10న జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 42వ డివిజన్​లో వైకాపా నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఆగ్రహించిన వైసీపీ నేతలు తెదేపా నేతలపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాహనాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వైకాపా నేతలపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంపై తెదేపా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details