దిశ చట్టం తీసుకొచ్చి ఏడాది గడుస్తున్నా...దాన్ని అమలు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని గుంటూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు.
నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి...ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆమె విమర్శించారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని మహిళలు ఏడాదిగా ఆందోళనలు చేస్తుంటే...ముఖ్యమంత్రి జగన్ వారిని పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...తెలుగుమహిళ కార్యకర్తలతో కలిసి నగరంలో ఆమె ఆందోళన నిర్వహించారు.