పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమని ఫిర్యాదుదారులు ఆరోపించారు. తమను చింతమనేని ప్రభాకర్ దూషించినట్లు పోలీసులే కథ అల్లారని బిళ్లా రామకృష్ణ, తోట సందీప్ వెల్లడించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్రా కార్యాలయాని వచ్చిన ఫిర్యాదుదారులు... పలు విషయాలు వెల్లడించారు. పోలీసులే తమతో బలవంతంగా కేసు పెట్టించారని స్పష్టం చేశారు.
'చింతమనేనిపై పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారు' - చింతమనేని ప్రభాకర్ అట్రాసిటీ కేసు
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కల్పితమేనని ఫిర్యాదుదారులు స్పష్టం చేశారు. తమను బెదిరించి పోలీసులే బలవంతంగా కేసు పెట్టించారని వెల్లడించారు.
ఫిర్యాదుదారులు
'చింతమనేని మాపై కేసు పెట్టారంటే స్టేషన్‌కు వెళ్లాం. అసలు ఆ రోజు ఆయన సంఘటనా స్థలానికే రాలేదు. పోలీసులే మాతో బలవంతంగా కేసు పెట్టించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అంతా కల్పితమే.'
-- చింతమనేనిపై కేసు పెట్టిన వ్యక్తులు.
ఇవీ చదవండి...'చింతమనేని వీడియో ఎడిట్, చేసి వైరల్ చేశారు'
Last Updated : Sep 7, 2019, 5:38 PM IST