ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Army recruitment: భారత ఆర్మీలో ప్రవేశాలు.. 15 నుంచి గుంటూరులో నియామకాలు - indian army -2021

భారత ఆర్మీలో (Indian army) చేరేందుకు యువత ఎంతో ఆసక్తి చూపిస్తారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కంటారు. అందుకు తగ్గట్టే... చిన్నప్పటి నుంచి కఠోర నియమాలను పాటిస్తూ లక్ష్య సాధన వైపు అడుగులేస్తారు. అలాంటి వారి కోసమే ఈ నెల 15 నుంచి గుంటూరులో ఆర్మీ నియామకాలు (recruitments) నిర్వహిస్తున్నారు. ప్రక్రియ అనంతరం.. తుది జాబితా ఆగష్టు 1న విడుదల చేయనున్నారు.

భారత ఆర్మీలో ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి గుంటూరులో నియామకాలు
భారత ఆర్మీలో ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి గుంటూరులో నియామకాలు

By

Published : Jul 3, 2021, 4:48 PM IST

భారత ఆర్మీలో ప్రవేశాలకు ఈనెల 15 నుంచి 30వ తేది వరకు గుంటూరులో నియామకాలు నిర్వహించనున్నట్టు రిక్రూట్​మెంట్ అధికారి కల్నల్ కోహ్లి తెలిపారు. కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగే ఈ నియమాకాలకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూరు జిల్లాలకు చెందిన వారు హాజరు కావచ్చని వెల్లడించారు. ఈ నియామకాల కోసం వేలాది మంది వస్తున్నందున.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ నియామకాలు ఏప్రిల్​లో జరగాల్సి ఉన్నా... కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నియామకాల ద్వారా సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్ మెన్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. WWW.JOININDIANARMY.NIC.IN వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని కల్నల్ కోహ్లి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబిజాను ఆగష్టు 1న వెబ్​సైట్​లో ప్రకటిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details