ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అధ్యక్షుడు హఠాన్మరణం.. వాకింగ్​ చేస్తూనే..! - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఏపీ స్పిన్నింగ్ మిల్స్ గౌరవ అధ్యక్షుడు దండా ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. వాకింగ్ చేస్తూ.. పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతూనే ప్రసాద్​ కుప్పకూలిపోయారు.

AP Spinning Mills president died
ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అధ్యక్షుడు మృతి

By

Published : Apr 18, 2022, 6:52 PM IST

ఏపీ స్పిన్నింగ్ మిల్స్, టెక్స్ టైల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, జ్యోతిర్మయి ప్రాపర్టీస్ సంస్థ ఎండీ దండా ప్రసాద్ ఆకస్మికంగా కన్నుమూశారు. గుంటూరులో ఇవాళ ఉదయం ఆరున్నర గంటల సమయంలో వాకింగ్ చేస్తూ.. ఓ వ్యక్తితో మాట్లాడుతుండగానే గుండెపోటు వచ్చింది. దీంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హుటాహుటిన ఆయనను కారులో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుంటూరు జీ.టీ రోడ్డులో.. జ్యోతిర్మయి ప్రాపర్టీస్ భారీ బహుళ అంతస్తుల సముదాయం నిర్మించింది. తాను నిర్మించిన వెంచర్‌లోనే ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రసాద్ మరణం.. కుటుంబసభ్యుల్లో, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండి: ఆ వార్తలు అవాస్తవం.. ఎఫ్​ఐఆర్​లో మా పేర్లు లేవు: టీజీ భరత్

ABOUT THE AUTHOR

...view details