AP HRDI : గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీ హెచ్‌ఆర్డీఐ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించటానికి సంస్థ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఏపీ హెచ్‌ఆర్డీఐను అక్కడ ఏర్పాటు చేయటానికి ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆవరణలోని పలు భవనాలను అధికారులు పరిశీలించినట్లు ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఏపీ విభజన చట్టంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సంస్థకు భవనాల నిర్మాణానికి గన్నవరం సమీపంలో కొండపావులూరులో వంద ఎకరాల భూమి కేటాయించారు. 2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత తొలుత నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొంత కాలం ఏపీ హెచ్‌ఆర్డీఐను నడిపారు. 2016 జూన్ నుంచి బాపట్ల విస్తరణ కేంద్రంలో హెచ్‌ఆర్డీఐ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. తర్వాత విశాఖ, పోలవరంలో ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించారు. ఏడాది క్రితం సంస్థను విశాఖకు తరలిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం కార్యాలయం తరలించాలని సంస్థ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించరాదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కార్యాలయం విశాఖకు ఎలా తరలిస్తారని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
AP HRDI : విశాఖకు ఏపీ హెచ్‌ఆర్డీఐ తరలింపు? - AP HRDI Head Office
AP HRDI : గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీ హెచ్‌ఆర్డీఐ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించటానికి సంస్థ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
విశాఖకు ఏపీ హెచ్‌ఆర్డీఐ తరలింపు?