అమరావతి ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర(amaravati farmers to hold maha padayatra news)పై ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఓ నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే స్పందించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది(ap high court orders to dgp sawang news). తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని హైకోర్టుకు అందజేయాలని పేర్కొంది.
నవంబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు 17 వరకు మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర చేయాలని అమరావతి ఐకాస నిర్ణయం తీసుకుంది(Amaravati Farmers to Hold Maha Padayatra From Nov 1st news). పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం అందజేసినా ఇంకా ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఐకాస ప్రతినిధుల తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ తన వాదనలు వినిపించారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల 13 జిల్లాలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు ఐకాస నేతలు వివరిస్తారన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ మానవేంద్ర రాయ్.. యాత్రకు అనుమతిపై ఓ నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.