రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి నెల ఏప్రిల్‌లోనే ఏకంగా రూ.14,136 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఆ నెలలో రెవెన్యూ ఖర్చు రూ.21,358.17 కోట్లు కాగా రెవెన్యూ వసూళ్లు కేవలం రూ7,221.92 కోట్లకే పరిమితమయ్యాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అకౌంట్స్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌వల్ల అన్ని రకాల వసూళ్లు మందగించాయి. ఖర్చులు మాత్రం రూ.24,113.59 కోట్ల మేర ఉన్నాయి. ఇందులో రుణాలు, తదితరాల రూపంలో తీసుకొచ్చింది ఏకంగా రూ.16,903.47 కోట్లు.
- కేంద్రం ఇచ్చింది రూ.4097 కోట్లు
మొత్తం ఆదాయంలో రెవెన్యూ వసూళ్లు రూ7221.92 కోట్లు కాగా కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చిన నిధులు రూ.4097 కోట్లు. మొత్తం అప్పులతో సహా అన్ని రూపాల్లో వచ్చిన ఆదాయమూ కలిపి రూ.24,113.59 కోట్లను ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఏప్రిల్ నెలకు జీతాలు, పెన్షన్లు సగం మొత్తమే చెల్లించినా జీతాలకు రూ.3,624.27 కోట్లు, పెన్షన్లకు రూ.1,251.32 కోట్లు ఖర్చు చేశారు.
- తొలి నెలలోనే రుణ భారం