ETV Bharat / city
ప్రియుడే నిందితుడు! - sp
మంగళగిరిలో జ్యోతి హత్య కేసులో నిందుతులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రియుడు శ్రీనివాసే ప్రధాన నిందితుడని తెలిపారు. హత్యచేయడానికి శ్రీనివాస్ కు పవన్ సహకరించాడని వివరించారు.
మీడియా ముందు జ్యోతి కేసులో నిందితులు
By
Published : Feb 23, 2019, 1:49 PM IST
| Updated : Feb 23, 2019, 6:33 PM IST
మీడియా ముందు జ్యోతి కేసులో నిందితులు మంగళగిరిలో జ్యోతి హత్యకేసులో నిందితులు శ్రీనివాస్, పవన్నుపోలీసులుఅరెస్టు చేశారు. ఇద్దిరినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు.శ్రీనివాస్, ఆయన స్నేహితుడు పవన్ కలిసి హత్య చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు వెల్లడించారు. శ్రీనివాస్ ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నేరం చేసినట్లు పవన్ అంగీకరించాడని ఎస్పీ తెలిపారు.శ్రీనివాస్ జ్యోతికి తరచూ ఫోన్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు.నిందితులు ఇద్దరిమధ్య చాలా కాలంగా స్నేహముందని.. ఇద్దరూ కలిసే హత్య చేశారని తేల్చారు.నిందితులు నిజాలు దాచిపెట్టడానికి చాలా ప్రయత్నంచారన్నారు. హత్యకేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని... మరోసారి దర్యాప్తు చేస్తామని ఎస్పీ తెలిపారు.
Last Updated : Feb 23, 2019, 6:33 PM IST