గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌ను బిల్డ్ ఏపీ నుంచి ప్రభుత్వం తప్పించింది. మార్కెట్ స్థలాన్ని మినహాయిస్తూ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ స్థలాన్ని అమ్మకానికి పెట్టడంపై వ్యాపారులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం మనసు మార్చుకుంది. వేలమందికి ఉపాధి పోతుందని విమర్శలు రావటంతో వెనక్కి తగ్గింది.
బిల్డ్ ఏపీ నుంచి పీవీకే నాయుడు మార్కెట్ తొలగింపు
గుంటూరు నగరంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌ను విక్రయించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో వెనక్కు తగ్గింది.
పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్