తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను మోడల్ టౌన్లుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 20 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ రెండు పట్టణాలను 1173 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలు ఏపీయూఐఏఎంల్ కు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి