ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆందోళన కలిగిస్తున్న అనుమానాస్పద కేసుల నమోదు - corona cases in guntur city news

కరోనా కాంటాక్ట్ కేసుల నమోదు తీరుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా కేసులు గుంటూరు జిల్లాలో 3 నమోదు కావటంపై.. మూలాలను కనిపెట్టే పనిలో పడ్డారు. అనుమానాస్పద కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు క్లియా మిషన్లను అందించామని... వీటి ద్వారా రోజులో గరిష్ఠంగా వెయ్యి పరీక్షలు చేయవచ్చని తెలిపారు.

carona cases
carona cases

By

Published : Apr 23, 2020, 5:37 PM IST

కరోనా కేసులను కొలిక్కి తెచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పోరాడుతోంది. అనుమానితుల గుర్తింపు, పరీక్షలకు పంపడం ఒక ఎత్తైతే.... వైరస్ చైన్ ను బ్రేక్ చేయడం మరింత కీలకంగా మారింది. దిల్లీతో పాటు విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించగా... ఈ జాబితాకు అదనంగా 32 వేల మందికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలో కేసుల వ్యాప్తి ప్రస్తుతం రెండో దశలోనే ఉందని ప్రభుత్వం చెబుతుండగా... కొన్ని అనుమానాస్పద కేసులు మాత్రం ఆందోళన కల్గిస్తున్నాయి.

దిల్లీ వెళ్లి వచ్చిన వారు... విదేశాలకు వెళ్లి వచ్చిన వారు కాకుండా.. ఎలాంటి సంబంధం లేకుండా వ్యాపిస్తున్న కొన్ని పాజిటివ్ కేసుల తీరుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఇలాంటివి గుంటూరు జిల్లాలో 3 ఉండగా.... రాష్ట్రంలో 52 కేసులున్నాయి. సామాజిక వ్యాప్తికి దారి తీసే ఈ కేసుల మూలాలను సాధ్యమైనంత త్వరగా గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. నమూనాలను సత్వరంగా పరీక్షించడం కోసం రాష్ట్రంలో అత్యధిక కేసులున్న 5 జిల్లాలకు ప్రభుత్వం క్లియా మిషన్లు అందించింది. గంటకు 100 కేసుల చొప్పున రోజులో గరిష్ఠంగా వెయ్యి వరకు ఈ మిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించవచ్చని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details