ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కట్టడికి కఠిన చర్యలు అవసరం: జాయింట్ కలెక్టర్

కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాజిటివ్ కేసులను ఖచ్చితంగా గుర్తించాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతి అన్నారు. సర్వేలెన్స్, ప్రైమరీ కాంటాక్ట్స్ టెస్టింగ్ పక్కాగా జరిగితేనే పాజిటివ్ కేసులను గుర్తించాడానికి వీలు పడుతుందన్నారు.

jc meet
jc meet

By

Published : May 4, 2021, 10:43 AM IST

గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు, ఏఎన్​ఎంలతో జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు నమోదు అయ్యే పాజిటివ్ కేసులను సంబంధిత పట్టణ ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ పరిశీలించి.. వారి లక్షణాలను బట్టి వారు హోం ఐసోలేషన్​లో ఉండేలా చూడాలన్నారు. కొవిడ్ కేర్​కి వెళ్లాలా, హాస్పిటల్​కి వెళ్లాలా అనేది నిర్ణయించాలన్నారు. ఇప్పటికే జరిగిన ఫీవర్ సర్వేలో కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్స్​కి తొలి ప్రాధాన్యతగా టెస్ట్ లు చేయించాలన్నారు.

సచివాలయ పరిధిలో కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఏఎన్​ఎంలు పని చేయాలని.. వారిని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షించాలన్నారు. నగరపాలక సంస్థ నుంచి నియమితులైన నోడల్ అధికారులు కూడా సచివాలయాల వారిగా.. ప్రతి రోజు కేసుల వివరాలు, టెస్ట్ లు, ట్రేసింగ్ లను గమనించాలన్నారు. ప్రభుత్వ కేంద్రాలు కాకుండా కొందరు ప్రైవేట్ ల్యాబ్​ల్లో రక్త పరీక్షలు, ఎక్స్ రే చేయించుకొని, పాజిటివ్​గా హాస్పిటల్స్ లో చేరుతున్నారన్నారు. కానీ ఏఎన్​ఎం స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు కొవిడ్ పట్ల అవగాహన కల్పించి ఆరోగ్య సమస్యలు ఉంటే.. తమకు తెలియచేయాలని భరోసా ఇచ్చి ఉంటే ప్రైవేట్ కేంద్రాలకు ప్రజలు వెళ్ళరని అన్నారు.

అలాగే హోం ఐసోలేషన్, హోం క్వారంటైన్​లో ఉండేవారిని ప్రతి రోజు గమనిస్తూ.. ఎటువంటి సమస్యలు ఎదురైనా మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలన్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు తప్పనిసరిగా ఫలితాలు వచ్చే వరకు హోం ఐసోలేషన్ లో ఉండేలే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ పరీక్షలు తొలుతగా ప్రైమరి కాంటాక్ట్స్, తర్వాత కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారికే చేయాలన్నారు. హోం క్వారంటైన్ లో ఉండేవారు నిర్దేశిత రోజులు ఇంటిలోనే ఉండేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details