ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఏఎన్‌యూ - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాజా వార్తలు
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఏడాది కాలంలో 24 ర్యాంకులు సాధించినందుకు ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ స్థాయిలో 15, జాతీయస్థాయిలో 7, రెండు ధ్రువపత్రాలను ఏఎన్‌యూ సొంతం చేసుకుంది. ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్ ఏఎన్‌యూకి మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఈ ఘనత దక్కలేదని... బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ఘనత దక్కిందని ఉపకులపతి (ఎఫ్ఏసీ) ఆచార్య రాజశేఖర్ చెప్పారు.
ఇండియా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఏఎన్‌యూ