Guntur girl rape case: గుంటూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన బాలికపై అత్యాచారం కేసులో.. మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో బాధపడుతున్న బాలికకు..ప్రకృతి వైద్యం చేయిస్తానంటూ మాయమాటలు చెప్పి..వ్యభిచార కూపంలోకి దింపిన కేసులో మొత్తం 74 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 53 సెల్ ఫోన్లు, కారు, 3 ఆటోలు, 3 బైకులు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఇందులో మరో ఆరుగురి పాత్ర ఉందని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: