ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telugu Academy FD scam case: తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణం..మరొకరు అరెస్ట్ - Telugu Academy Case

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణం కేసు(Telugu Academy FD scam case)లో మరొకరు అరెస్టయ్యారు. కొయంబత్తూరులో పద్మనాభన్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణం కేసులో మరోకరు అరెస్ట్
తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణం కేసులో మరోకరు అరెస్ట్

By

Published : Oct 7, 2021, 8:56 PM IST

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణం కేసు(Telugu Academy FD scam case)లో మరొకరు అరెస్టయ్యారు. కొయంబత్తూరులో పద్మనాభన్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్ము కోసం పద్మనాభన్‌ నకిలీ పత్రాలు సృష్టించారు.

దర్యాప్తు ముమ్మరం...

తెలుగు అకాడమీ కేసులో (TELUGU AKADEMI FD SCAM) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణారెడ్డి, మదన్, భూపతి, యోహన్​రాజ్.. డిపాజిట్లు గోల్​మాల్ కేసులో భాగస్వాములైనట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే పద్మనాభన్​ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తెలుగు అకాడమీకి సంబంధించిన చెక్కులను కృష్ణారెడ్డి సేకరించి.. వాటిని సాయికుమార్​కు అందించినట్లు సీసీఎస్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

సోమశేఖర్ సాయంతో సాయికుమార్.. ఆ డిపాజిట్లను యూబీఐ, కెనరా బ్యాంకులో జమ చేసి.. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే వాటిని అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించారు. అక్కడి నుంచి విడతలవారీగా డబ్బులు తీసుకున్నారు. ఆ నగదును నిందితులందరూ వాటాలుగా పంచుకున్నారు. ఇందులో సాయికుమార్ అధిక మొత్తంలో 20 కోట్ల రూపాయలు తీసుకున్నాడు.

ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ రావు రూ.10 కోట్లు, యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీ రూ.2.5 కోట్లు, కెనరా బ్యాంకు మేనేజర్ సాధన రూ.2 కోట్లు.. పరారీలో ఉన్న వెంకటరమణ రూ.7 కోట్లు, కృష్ణారెడ్డి రూ.6 కోట్లు, రమణారెడ్డి రూ.6 కోట్లు ఇలా వాటాలు పంచుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల ఖాతాలన్నీ పరిశీలించాల్సింది ఉందని, డబ్బులను ఎక్కడికి (TELUGU AKADEMI FD SCAM) మళ్లించారో తెలుసుకోవాల్సి ఉందని సీసీఎస్​ పోలీసులు తెలిపారు. బుధవారం అరెస్ట్​ చేసిన ఆరుగురు నిందితులనూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీచూడండి:

Badvel by-poll: బద్వేలు ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్

ABOUT THE AUTHOR

...view details