ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mandadam: ఇక నుంచి 'బిల్డ్ అమరావతి'గా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.. - గుంటూరు జిల్లా తాజా వార్తలు

Mandadam: .ఇప్పటివరకు సేవ్‌ అమరావతి దిశగా సాగిన తమ ఉద్యమం ఇకపై బిల్డ్ అమరావతి దిశగా ముందుకు తీసుకెళ్తామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం మందడం దీక్షా శిబిరంలోని న్యాయదేవత విగ్రహానికి రాజధాని రైతులు పాలాభిషేకం చేశారు. పోరాటంలో వివిధ ఘట్టాలను గుర్తుచేసుకుని పలువురు కన్నీటితో ఉద్వేగానికి లోనయ్యారు.

anointing of the statue of the goddess of justice
దీక్షా శిబిరంలోని న్యాయదేవత విగ్రహానికి పాలాభిషేకం

By

Published : Mar 3, 2022, 4:12 PM IST

Mandadam: రాజధానిపై హైకోర్టు తీర్పు అనంతరం మందడం దీక్షా శిబిరంలోని న్యాయదేవత విగ్రహానికి రాజధాని రైతులు పాలాభిషేకం చేశారు.ఇప్పటివరకు సేవ్‌ అమరావతి దిశగా సాగిన తమ ఉద్యమం ఇకపై బిల్డ్ అమరావతి దిశగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టంచేశారు. రాజధానిపై కోర్టు తీర్పు వచ్చేవరకు టీవీలో ఉత్కంఠగా వీక్షించిన రైతులు తీర్పు వెలువడగానే స్వీట్లు పంచుకుంటూ తమ హర్షాన్ని వ్యక్తంచేశారు. ఆకుపచ్చ రంగు జల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో తేలియాడారు. వెలగపూడిలో అమరావతి విగ్రహం వద్ద బాణసంచా కాల్చారు. పోరాటంలో వివిధ ఘట్టాలను గుర్తుచేసుకుని పలువురు కన్నీటితో ఉద్వేగానికి లోనయ్యారు. సమష్టి కృషితో సాధించిన ఈ విజయాన్ని నిలబెట్టుకు తీరుతామని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details