లాక్డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకున్న వలస కూలీలకు అమ్మ ఛారిటబుల్ ట్రస్టు ఆహారం అందిస్తోంది. గుంటూరు ఆటోనగర్ పారిశ్రామికవాడలో బిహార్, ఒడిశాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు పనిచేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఆటోనగర్లో పరిశ్రమలు మూత పడ్డాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వారి పరిస్థితిని స్థానిక ఉన్న వార్డు వాలంటీర్... అమ్మ ఛారిటబుల్ ట్రస్టు దృష్టికి తీసుకెళ్లారు. అమ్మ ట్రస్టు కూలీలకు ఆహారం అందించి, వారి ఆకలి తీరుస్తున్నారు. గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆహారం అందిస్తున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
వలస కూలీల ఆకలి తీరుస్తున్న 'అమ్మ' - గుంటూరు లాక్ డౌన్ న్యూస్
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక, ఊళ్లకు వెళ్లలేక గుంటూరు నగరంలో చిక్కుకున్న వలస కూలీలకు అమ్మ ఛారిటబుల్ ట్రస్టు బాసటగా నిలిచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఆహారం అందిస్తూ ఎంతో మంది ఆకలిని తీరుస్తుంది.
వలసకూలీల ఆకలి తీరుస్తున్న 'అమ్మ'