గుంటూరు జిల్లా వ్యాప్తంగా అమరావతి రైతులు పోరాటానికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.
పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేటలో అమరావతి ర్యాలీలు
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని గుంటూరు జిల్లా పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లో అమరావతి, అఖిల పక్ష ఐకాస, రైతులు.. మండల తెదేపా నాయకులు రాజధాని రైతులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అమరావతి రైతుల ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్ల కార్డులుప్రదర్శించారు.
గుంటూరులో...
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని.. అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ తహసీల్దార్లకు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యాలయంలో తెదేపా, వామపక్షాలు, ఐకాస నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిని పరిపాలన రాజధానిగా కొనసాగించాలని గత 300 రోజులుగా రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని అమరావతి పరిరక్షణ సమితి రాజకీయతేర ఐకాస నాయకుడు మల్లికార్జునరావు అన్నారు. అమరావతి కోసం మహిళలు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి ఈ రాష్టంలోనే ఏర్పడిందని రాజకీయతేర ఐకాస మహిళ నాయకులు డాక్టర్ శైలజ అన్నారు.
నరసరావుపేటలో..