ఉద్దండరాయునిపాలెంలో మహిళా రైతులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ, అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీని కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అనంద్బాబు, ఆలపాటి రాజేద్రప్రసాద్, గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి ఐకాస నేతలు ఎస్పీని కలిసి... రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళల పట్ల జరుగుతున్న దాడులను వివరించారు.
'మూడు రాజధానుల పేరుతో స్థానికేతరులు దౌర్జన్యం చేస్తున్నారు' - Attacks On Amaravati Movement Activists news
మహిళా రైతులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ, అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీకి విజ్ఞప్తి చేశారు. రైతులపై దాడి చేసినవారిని ఇంతవరకూ అరెస్టు చేయలేదని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మూడు రాజధానుల పేరుతో స్థానికేతరులు దౌర్జన్యం చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.
రైతులపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్టు చేయలేదని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజధానికి భూములిచ్చి త్యాగం చేసిన రైతులు, మహిళలపై... మూడు రాజధానుల పేరుతో స్థానికేతరులు దౌర్జన్యం చేస్తున్నారని పుల్లారావు ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే 29 గ్రామాల ప్రజలు రోడ్లపైకి రావడం ఖాయమని పుల్లారావు హెచ్చరించారు. రైతులు, మహిళలపై దాడులు చేసినవారిపై పోలీసులు తక్షణ చర్యలు చేపట్టాలని రాజధాని రైతుల ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు ఎస్పీని కోరారు.
ఇదీ చదవండీ... బాధితుల రక్త నమూనాల్లో సీసం గుర్తింపు..: ఏలూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్