ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు - ఏపీలో మూడు రాజధానులు

రాజధాని బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటంపై అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల నల్లజెండాలతో ధర్నాకు దిగారు.

amaravati  jac
amaravati jac

By

Published : Aug 1, 2020, 9:19 PM IST

అమరావతి పరిరక్షణ జేఏసీ ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం అయ్యాయి. జేఏసీకి మద్దతుగా తెదేపా నేతలు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. గవర్నర్ నిర్ణయానికి నిరసనగా...జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే పలు నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలు ఎగరవేయడం, ధర్నాలు, విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వటం వంటివి చేపట్టారు.

రాజధాని ప్రాంత జిల్లాల్లోనే కాకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమ 4 జిల్లాల్లో కూడా నిరసనలు చేపట్టారు. ప్రాంతీయ ద్వేషాలు వద్దు-అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. యువతకు ఉపాధి కావాలంటే రాజధానిగా అమరావతినే ఉంచాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details