ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అమరావతి రైతులు గెలుస్తారనే భయంతోనే అక్రమ అరెస్టులు'

By

Published : Oct 29, 2020, 3:05 PM IST

అమరావతి రాజధాని విషయంలో రైతులు గెలుస్తారనే భయంతోనే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఐకాస నాయకులు ఆరోపించారు. రైతులకు బేడీలు వేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన చేపట్టారు.

amaravathi jac protest in guntur
గుంటూరులో అమరావతి జేఏసీ నిరసన

రైతులకు సంకెళ్లు వేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టాయి. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులపై అట్రాసిటీ కేసులు బనాయించారంటూ విమర్శించారు.

తెదేపా జాతీయ అధికార ప్రతినిథి మొహమ్మద్ నజీర్, అమరావతి పరిరక్షణ సమితి రాజకీయేతర ఐకాస నేతలు మల్లికార్జునరావు, రాయపాటి శైలజ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా అమరావతి రైతులదే అంతిమ విజయమని అన్నారు. రాజధాని రైతులు గెలుస్తారన్న భయంతోనే అక్రమ అరెస్టులన్న నాయకులు... ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే యత్నాలను సంఘటితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details