ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 137వ రోజు ఆందోళనలు కొనసాగించారు. పగలు, రాత్రి తేడా లేకుండా రైతులు, మహిళలు భౌతిక దూరం పాటిస్తూ నిరసన చేపట్టారు. అమరావతి వెలుగు పేరుతో తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, బోరుపాలెం, రాయపూడిలో రైతులు, మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపారు. కరోనా దేశం నుంచి విడిచిపోవాలని ఆకాంక్షించారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కలల రాజధాని కోసం అలుపెరుగని పోరాటం - farmers protest in guntur
పగలు, రాత్రి తేడా లేదు. కరోనా భయం ఉన్నా బెదరడం లేదు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే తమ కలల రాజధాని అమరావతి కోసం రైతులు పోరాటం సాగిస్తున్నారు. అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
కలల రాజధాని కోసం అలుపెరుగని పోరాటం