అమరావతి పోరాటానికి మద్దతిస్తున్నందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని రైతులు కన్నాతో భేటీ అయ్యారు. సీఆర్డీఏ, పాలన వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్ కు కన్నా లేఖ రాయటంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని పరిధిలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా... అక్కడి భూముల్ని ఇతర ప్రాంతాల వారికి ప్లాట్లుగా పంచుతామని ప్రభుత్వం చెప్పటాన్ని రైతులు తప్పుబట్టారు.
కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపిన రాజధాని రైతులు - కన్నా లక్ష్మీనారాయణతో రాజధాని రైతులు భేటీ
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో రాజధాని రైతులు భేటీ అయ్యారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు రైతులు కన్నాకు కృతజ్ఞతలు తెలిపారు. బిల్లులు ఆమోదించవద్దని కన్నా గవర్నర్ కు లేఖ రాయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపిన రాజధాని రైతులు