సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి డీఎస్సీ క్యాలిఫైడ్ అభ్యర్థులు యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. - డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు
09:27 September 20
డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు వస్తారన్న సమాచారంతో బందోబస్తు
1998 డీఎస్సీ క్యాలిఫైడ్ అభ్యర్థులు.. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయానికి వస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. వైకాపా కేంద్ర కార్యాలయంతోపాటు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అదనపు పోలీసు బలగాల మొహరించారు. తాడేపల్లి పాతటోల్ గేట్, ప్రాతూరు క్రాస్ రోడ్డు, ఆంధ్రరత్నా కట్ట, భారత మాతా కూడలి, ఎన్టీఆర్ కట్ట, వారధి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు కార్యాయానికి వస్తున్న 1998 డీఎస్సీ క్యాలిఫైడ్ అభ్యర్థులను.. ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:CM JAGAN: దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం