ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ పొడిగింపును స్వాగతిస్తున్నాం: ఆలపాటి - ఇండియా లాక్​డౌన్ 2 న్యూస్

దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్​డౌన్​ పొడిగించడాన్ని తెదేపా స్వాగతిస్తుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నామన్నారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించాలని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Alapati rajendraprasad
ఆలపాటి రాజేంద్రప్రసాద్

By

Published : Apr 14, 2020, 4:13 PM IST

లాక్​డౌన్ పొడిగింపుపై మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్

మే 3 వరకూ దేశవ్యాప్త లాక్​డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వాగతించారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు చెప్పారు. తెదేపా పొలిట్ బ్యూరో ఇప్పటికే ఈ దిశగా తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని, కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details