ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అగ్రిగోల్డ్​ బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి' - agrigold victims problems

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

'అగ్రిగోల్డ్​ బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి'
'అగ్రిగోల్డ్​ బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి'

By

Published : May 3, 2020, 1:52 PM IST

రాష్ట్రంలో ఇంకా పరిహారం అందని అగ్రిగోల్డ్​ బాధితులు వేలమంది ఉన్నారని.. వారికి వెంటనే పరిహారం అందించాలని అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. ఈమేరకు ఆయన వివరాలు వెల్లడించారు. కట్టిన సొమ్ము రూ.10 వేల లోపు ఉన్నవారికి ప్రభుత్వం కొంతమొత్తం చెల్లించిందని అన్నారు.

హామీలు అమలు చేయాలి

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రూ.20 వేల లోపున్న వారికి రూ.1,150 కోట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు నాగేశ్వరరావు గర్తు చేశారు. మిగిలిన వారికి కాలపరిమితితో ఇస్తామన్న హామీని సైతం అమలు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్​ యాజమాన్య ఆర్థిక దాహానికి 350 కుటుంబాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని లేఖలో కోరారు.

ఇదీ చూడండి:

'దొంగ కేసులు బనాయించిన పోలీసులకు ధన్యవాదాలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details