గ్రామ సచివాలయ వ్యవసాయ పోస్టుల భర్తీ పరీక్షల్లో తమకు అవకాశం కల్పించాలంటూ... ఇతర రాష్ట్రాల్లో అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు గుంటూరులో సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. నగరంలోని సంగడిగుంట ప్రాంతంలో... బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఎక్కిన విద్యార్థులను కిందకు దించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇతర రాష్ట్రాల్లో చదివినప్పటికీ... తమకు యూజీసీ గుర్తింపు ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. వ్యవసాయ కోర్సులతో సంబంధం లేనివారిని పరీక్షలకు అనుమతిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో యూజీసీ గుర్తింపు ఉన్న వ్యవసాయ డిగ్రీలను అనుమతిస్తున్నారని... ఇక్కడ మాత్రం తమను పక్కనపెట్టారని ఆరోపించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు... తమను గ్రామ సచివాలయ పరీక్షలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
'సెల్‌టవర్ ఎక్కిన అగ్రికల్చర్ విద్యార్థులు'
ఇతర రాష్ట్రాల్లో అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన అభ్యర్థులకు గ్రామ సచివాలయ పోస్టుల్లో అవకాశం కల్పించకపోవటాన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.
విద్యార్థుల ఆందోళన