గుంటూరు నగరంలోని పురుగు మందుల గోదాముల్లో వ్యవసాయశాఖ విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలకనుగుణంగా ఆరు బృందాలుగా విడిపోయి నగరంలోని పురుగు మందుల కంపెనీలు, వాటి గోదాముల్లో సోదాలు నిర్వహించారు.
రూ. 2.91 కోట్ల విలువైన పురుగు మందులను అధికారులు గుర్తించారు. వీటిలో రూ. 51 లక్షల విలువైన పురుగు మందులను అధికారులు సీజ్ చేశారు. అలాగే కాలం చెల్లిన మందుల అమ్మకాలను నిలుపుదల చేయాలని సూచించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం. విజయభారతి తెలిపారు.