ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరకోటి విలువైన కల్తీ పురుగుమందులు పట్టివేత - adulterated bio fertilizers caught in guntur

గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారంలోని గోదాంలో రూ.46 లక్షలు విలువైన కల్తీ బయో పురుగుమందులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. వీటి అమ్మకాలకు ఎటువంటి అనుమతులు లేవని అధికారుల తెలిపారు.

అర కోటి విలువైన కల్తీ పురుగుమందులు పట్టివేత

By

Published : Oct 10, 2019, 6:43 AM IST

అర కోటి విలువైన కల్తీ పురుగుమందులు పట్టివేత
గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారంలోని పల్నాడు పార్సిల్ కార్యాలయం సమీపంలో ఉన్న పురుగుమందుల గోదాంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. గోదాంలో నిల్వఉంచిన 46 లక్షల విలువైన కల్తీ బయో పురుగుమందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి అమ్మకాలకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. గోదాంలో మొత్తం 36 రకాల బయో ఉత్పత్తులను గుర్తించగా.... ఇవన్నీ తెలంగాణలోని సంగారెడ్డి కేంద్రంగా తయారవుతున్నట్లు గుర్తించారు. కల్తీ బయోఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయభారతి సూచించారు.

ఇదీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details