Acid Attack on Woman : గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో దారుణం చోటుచేసుకుంది. దాహంగా ఉంది తాగటానికి గ్లాసుడు నీళ్లవ్వరూ అంటూ ఓ ఇంటి వద్దకు వెళ్లి అడిగాడో వ్యక్తి. మానవత్వంతో.. ఇంట్లోకి వెళ్లి నీళ్లు తెచ్చింది ఆ ఇంట్లోని మహిళ. మంచినీళ్ల గ్లాసు అతనికి ఇవ్వబోతుండగా.. హఠాత్తుగా ఆమెపై యాసిడ్ పోశాడు ఆ దుండగుడు! అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ అనూహ్య సంఘటనతో బాధితురాలితోపాటు అక్కడున్నవారంతా షాకయ్యారు.
Acid Attack on Woman : మంచి నీళ్లు అడిగాడు.. మహిళపై యాసిడ్ పోసి పోయాడు..! - మాడుగులలో మహిళపై యాసిడ్ దాడి
Acid Attack on Woman : గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దాహంగా ఉంది తాగటానికి గ్లాసుడు నీళ్లవ్వరూ అంటూ మహిళను అడిగాడో వ్యక్తి. మానవత్వంతో నీళ్లు తెచ్చి ఇచ్చిన ఆమెపై.. యాసిడ్ పోసి పరారయ్యాడు!
తాగటానికి మంచి నీళ్లు అడిగాడు...మహిళపై యాసిడ్ పోసి పోయాడు...
యాసిడ్ మీద పడటంతో బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి : Theft in PS: లాయర్ కోటు వేశాడు.. పోలీస్ స్టేషన్కు పోయాడు.. బైకులు ఎత్తుకెళ్లాడు!!